MS Dhoni: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 17వలో చెన్నై జట్టుకు మరో ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో సీఎస్‌కే జట్టు ఓటమిపాలైంది. ఛేజింగ్‌లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ, చెన్నై జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో వరుసగా మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
పడిపోయిన ధోని బ్యాటింగ్..
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసింది. 11వ ఓవర్ సమయానికి చెన్నై జట్టు 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. లక్ష్యాన్నిసాధించే ఛాన్స్ ఉంది. కానీ, ధోని, విజయ్ శంకర్ మాత్రం టెస్ట్ బ్యాటింగ్‌తో చిరాకు తెప్పించారు. ధోని తన మొదటి బౌండరీని కొట్టడానికి ఏకంగా 19 బంతులు తీసుకున్నాడు. 18వ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఒక సిక్స్ కొట్టాడు.
ఐపీఎల్ 2025లో ఒక బ్యాటర్ తన తొలి బౌండరీ కొట్టడానికి తీసుకున్న అత్యధిక బంతులు ఇవే కావడం గమనార్హం. మొత్తంగా 26 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ధోని తన ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్ మాత్రమే బాదాడు. చివరి ఓవర్లలో దూకుడైన బ్యాటింగ్‌తో ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. ఈమ్యాచ్‌లో టెస్ట్ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. మరోవైపు విజయ్ శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేశాడు. దీంతో చెన్నై ఆట పట్ల అన్నివైపుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
Mahendra Singh Doni Aap se ye Ummid Nahi Thi…🥺
30 Run in 26 Ball 🏀
Thala Thak Gaya….🥹#CSKvsDC#CSKvDC #DhoniRetirement pic.twitter.com/xLFA2iKcvp
— Uzma Parveen (@Nation__frist) April 5, 2025
మొత్తం మీద సీఎస్‌కే ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోయింది. IPL 2025లో ప్లేఆఫ్‌లకు చేరుకోవాలనుకుంటే ఇకపై వరుస విజయాలు నమోదు చేయాల్సిందే. లేదంటే ప్లేఆఫ్స్ చేరుకోకుండానే 18వ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో గొప్ప ఆరంభాన్ని సాధించాలని ఆశిస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..