సిద్దిపేట: జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఈ సందర్భంగా అమరులకు సంతాపం తెలిపారు. పహల్‌గామ్‌లో తీవ్ర వాదుల చర్య దుర్మార్గమైనదని అన్నారు. ఇవాళ(గురువారం) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… అన్యపుణ్యం తెలవని 27మంది పర్యాటకులను ఉద్రవాదులు దుర్మార్గంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌లో తెలంగాణకి చెందిన 150మంది పర్యాటకులు ఉన్నారని తెలిపారు. ఈ దాడి ఘటనపై సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని.. వారికి దేశం పట్ల ప్రేమ లేదా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
స్టాలిన్, కమలాసన్, ప్రకాశ్‌రాజ్ ఎందుకు జమ్మూ కశ్మీర్ ఘటనపై నోరు మెదపడం లేదని.. ఈ దేశంపై మీకు ప్రేమ లేదా అని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాబర్ట్ వాద్రా బీజేపీపై బురదజల్లటం మానుకోవాలని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్‌మెంట్‌కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. గత రెండు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు బాధాకరమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
ఒక వర్గానికి చెందిన కొంతమంది శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మదర్సాల గురించి రేవంత్ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ ధర్మం పరమత సహనాన్ని పాటించమని చెబుతోందని అన్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ప్రస్తుతం లేరని అన్నారు. మతం పేరిట జరిగిన దాడులను హిందువులు ఖండించాలని.. ఆలోచించాలని చెప్పారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మదర్సాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: రేవంత్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. కేటీఆర్ విసుర్లు
Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం
Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ముగ్గురు మావోలు మృతి
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 24 , 2025 | 02:46 PM