విజయవాడ: రైతులకు, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభా ప్రాంగణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయలుదేరారు. ఇవాళ(శుక్రవారం) ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ అప్పలనాయుడు దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు.
జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. మన రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి జగన్ తీసుకువచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వలో మళ్లీ అమరావతికి పునర్ వైభవం వచ్చిందని ఉద్ఘాటించారు. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా రూపొందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావడం శుభపరిణామమని అన్నారు. విజయనగరంలో ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణం, పలు నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒక ఎంపీగా నగర పౌరుడుగా రైతుబిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు.
నరేంద్రమోదీ ఒక యోగిలా ప్రపంచాన్ని కాపాడుతున్నారు: బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక యోగిలా ప్రపంచాన్ని కాపాడుతున్నారని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ జనగణనతో పాటు కులగణన జరపాలని అనుకోవడం ఒక చారిత్రక పరిణామమని ఉద్ఘాటించారు. బీసీలు 26 సంవత్సరాల నుంచి జనగణనతో పాటు కలగణన జరగాలని పోరాటాలు చేశామని గుర్తుచేశారు. 70, 80 సార్లు ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేశానని చెప్పారు. బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క లేకుండా పోయిందని అన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. గతంలో ఎంతోమంది ప్రధానులను కలిశానని, ఎక్కడ న్యాయం జరగలేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేశారని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోడెల శివప్రసాదరావుకు మంత్రి లోకేష్ నివాళి..
గొర్రెల స్కామ్.. దళారి మొయినుద్దీన్ అరెస్ట్..
For More AP News and Telugu News
Updated Date – May 02 , 2025 | 03:00 PM