మోటోవోల్ట్ కంపెనీ భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎం7 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.23 లక్షలుగా నిర్ణయించింది. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో పాటు బెస్ట్ మైలేజ్ స్కూటర్ కావాలంటే మోటోవోల్ట్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. మోటోవోల్ట్ ఎం7 పనితీరు విషయానికి వస్తే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది. అతి పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రావడం వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే 166 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. రోజువారీ పనులతో పాటు దూర ప్రయాణాల సమయంలో స్కూటర్‌ను సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
మోటోవోల్ట్ ఎం7 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ స్కూటర్‌ను చాలా త్వరగా ఛార్జ్ చేయవచ్చు. మోటోవోల్ట్ ఎం7 లో అనేక స్మార్ట్, అధునాతన ఫీచర్లు ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్‌తో నావిగేషన్ సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి లక్షణాలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫీచర్ల కారణంగా రైడింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మోటోవోల్ట్ ఎం7 ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు ఆకట్టుకుంటాయి. ఈ స్కూటర్ పర్యావరణానికి కూడా గొప్ప ఎంపికగా ఉంటుంది. మోటోవోల్ట్ ఎం7 డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ డిజైన్ ఏరోడైనమిక్‌గా ఉండటమే కాకుండా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.
మోటోవోల్ట్ ఎం7 కి సూపర్ ఫైనాన్స్ ప్లాన్ అందుబాటులో ఉంది. కేవలం రూ.15,000 మాత్రమే డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఆ తర్వాత మీకు బ్యాంకు నుంచి 9.7% వడ్డీ రేటుతో రుణం అందిస్తారు.. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు రాబోయే 3 సంవత్సరాలు అంటే 36 నెలలు ప్రతి నెలా రూ.4,403 నెలవారీ ఈఎంఐ చెల్లించాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి