Modi addresses Bihar Public assembly for the primary time after Pahalgam assault

Written by RAJU

Published on:

  • పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్ సభలో పాల్గొన్న మోడీ
  • ఉగ్రవాదాన్ని తుది ముట్టించే సమయం ఆసన్నమైందని వెల్లడి
Modi addresses Bihar Public assembly for the primary time after Pahalgam assault

పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశమంతా దు:ఖంలో మునిగిపోయిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది మహిళలు.. తమ భర్తలను కోల్పోయారని.. వారందరికీ దేశమంతా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని తుది ముట్టించే సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నామని.. వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టమని మోడీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో సంబరాలు.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి (వీడియో)

మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఇక మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ నుంచి టూరిస్టులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఉగ్ర దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. చిక్కుకున్న టూరిస్టులకు 15 రోజులు ఉచిత బస కల్పిస్తామని హోటళ్లు ముందుకొచ్చాయి.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌కు అమెరికా మాజీ అధికారి కీలక సూచన

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights