Miss World: సీపీఆర్‌ స్కిల్స్‌ ఉంటేనే మిస్‌ వరల్డ్‌ కిరీటం..? ఊపందుకున్న బ్యూటీ విత్‌ పర్పస్‌ ఉద్యమం

Written by RAJU

Published on:

అందాల పోటీలు అంటేనే అదో క్రేజ్‌. కిరీటం ఎవరికి దక్కుతుందనే దాని కోసం పోటీదారులే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటుంది. అందంతో పాటు ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌, దాణ గుణాలు, సోషల్‌ సర్వీస్‌ వంటి వాటిలో పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే అందానికి కూడా ఓ పర్పస్‌ ఉండాలంటోంది మిస్‌ వరల్డ్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ హోల్డర్‌ మిల్లా మాగీ. మిస్‌ వరల్డ్‌ పోటీలు మూసధోరణిలో కాకుండా స్కిల్స్‌ పోటీ కూడా ఉండాలంటోంది. ఈ క్రమంలో ఈసారి సీపీఆర్‌ స్కిల్స్‌ను ప్రవేశ పెట్టారు.

చివరి రౌండ్‌లో పోటీదారులకు సీపీఆర్‌ స్కిల్‌టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేగాదు మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. ఫైనల్‌కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్‌ రౌండ్‌లో ఈ సీపీఆర్‌ టెస్ట్‌ని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్‌ వరల్డ్‌పోటీల్లో కూడా సీపీఆర్‌ రౌండ్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది.

మిల్లా మాగీ తన పూర్వీకులను ఈ సీపీఆర్‌ స్కిల్‌ తెలియకే కాపాడుకోలేకపోయారట. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్‌ కోసం అయినా..సీపీఆర్‌ స్కిల్స్‌ నేర్చుకుంటారు. ఎలా చేయాలో ఆన్‌లైన్‌ సెషన్‌లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోంది ఈ సుందరి.

ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ మాగీ ఫైట్‌ చేస్తోంది. “గో విత్ సిపిఆర్” అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్‌లో ఊపందుకుంది. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు సపోర్ట్‌ చేశారు. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్‌ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్‌ చేయడం నేర్చుకున్నాని అన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights