Mirza Riyaz ul Hassan Effendi Chosen as MIM Candidate for Hyderabad Native Authorities MLC

Written by RAJU

Published on:

  • ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్
  • గతంలో 2009, 2016లో కార్పొరేటర్‌గా గెలుపు
  • తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన
Mirza Riyaz ul Hassan Effendi Chosen as MIM Candidate for Hyderabad Native Authorities MLC

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ ఎంపికయ్యారు.. గతంలో 2009లో నూర్ ఖాన్ బజార్, 2016 లో డబిర్ పురా కార్పొరేటర్ గా గెలుపొందిన మీర్జా రియాజ్. 2019 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది.. 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తైంది.. ఎంఐఎం తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.

READ MORE: AP Secretariat: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి

కాగా.. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పోటీలో ఉండబోమని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేడు ఎంఐఎం అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.. ఇప్పటివరకు దాఖలైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే.. ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 110 మంది ఓటర్లు ఉన్నారు.. 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంఐఎం నుంచి 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1ఎమ్మెల్సీలు, 40 కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లు ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లు, బీఆర్ఎస్ నుంచి 25 మంది ఓటర్లు, బీజేపీ నుంచి 22 ఓటర్లు ఉన్నారు.

READ MORE: BJP MLA Raja Singh: “మీకు గులాం గిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు”.. సొంత పార్టీపై రాజాసింగ్ ఫైర్

Subscribe for notification
Verified by MonsterInsights