- సికింద్రాబాద్ RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా సారధి పోర్టల్ ప్రారంభోత్సవం
- పోర్టల్ ప్రారంభించిన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…
- వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్
- రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలను సులభతరం చేసేందుకు ఉపయోగపడనున్న పోర్టల్.

Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేందర్ మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతోపాటు రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు.
Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
ఈ వాహన్ సారథి పోర్టల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేయడంల దోహద పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఇందులో వాహనాలకు సంబంధించి పర్మిట్‌లు, అలాగే డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్‌లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ పోర్టల్ లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అనుసంధానమైనా.. ఇన్ని సంవత్సరాల తర్వాత జాతీయ పోర్టల్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ సమాచార కేంద్రం ద్వారా వాహనాలకు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన అన్ని రకాల వివరాలన్నింటిని ఈ పోర్టల్ నమోదు చేయనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ మార్పుల వంటి పనులను చేసుకునే అవకాశం కలగనుంది.