- విస్తృత స్దాయిలో ప్రజల్లోకి భూ భారతి..
- 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి..
- మార్పుకు నాంది భూ భారతి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti: భూ భారతి పోర్టల్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతికి అనూహ్య స్పందన లభిస్తుంది. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి అయ్యాయి. 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేశాం.. భూ సమస్యలపై ఇప్పటి వరకు 11, 630 దరఖాస్తులను స్వీకరించాం.. ఈ నెల 5వ తేది నుంచి జిల్లాకు ఒక మండలం చొప్పున 28 మండలాలలో భూ భారతిని అమలు చేస్తాం అన్నారు. మార్పుకు నాంది భూ భారతి పోర్టల్.. అయితే, 20 జిల్లాల్లో 45 సదస్సుల్లో స్వయంగా నేనే పాల్గొన్నాను అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.