- పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోంది
- పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందన్నారు

పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని విలువలకు తిలోదకాలిచ్చింది. పాకిస్తాన్, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో.. మాట్లాడుతోంది. పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందన్నారు.
Also Read:Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
పాకిస్తాన్ మంత్రులు.. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ నేతలు చేసిన ట్వీట్లను పాకిస్తాన్ రీట్వీట్ చేయడం.. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ స్నేహబంధానికి అద్దం పడుతోంది. పహల్‌గామ్ ఘటన తర్వాత.. భారతీయుల రక్తం ఉడుకుతోంది. పాక్ కు దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సమయంలో ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ సైన్యానికి అండగా ఉండాల్సిన బాధ్యతను మరిచిన కాంగ్రెస్ పార్టీ.. ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతుండటం అత్యంత హేయమైనచర్య. ప్రధానమంత్రి చిత్రంలో తలను తొలగించి ‘గాయబ్’అని పోస్టు చేయడం కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని అన్నారు.
Also Read:Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. రికార్డులే కాదు.. రూ.10 లక్షల రివార్డులు కూడా!
ఈ సారి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతిచ్చాయి. మజ్లిస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మజ్లిస్ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే సంకేతాలు స్పష్టంగా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చాం.. రాబోవు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది.. కాంగ్రెస్ పాలనలో కంటే మోడీ వచ్చాక ఉగ్రవాదం పూర్తిగా తగ్గింది.. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో అనేక సార్లు బాంబు బ్లాస్ట్ లు జరిగాయి.. ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయి..
Also Read:Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్.. భయపెట్టబోతున్న బెల్లంకొండ
370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధి వైపుకు పయనిస్తుంది.. కశ్మీర్ అభివృద్ధి ఈ దేశంలో ఉన్న అంతర్గత శక్తులకు, పాకిస్తాన్ శక్తులకు ఏమాత్రం ఇష్టం లేదు.. శాంతి సమస్యతో ముందుకు వెళ్తున్న కశ్మీర్ ను చూసి పాకిస్తాన్ సహించలేకపోతుంది.. పెహల్గంలో హిందువులు, ముస్లింలను విభజించి, అతి కిరాతంగా కాల్చి చంపారు.. కశ్మీర్ సినిమాను నాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకింది.. నేడు పెహల్గం ఘటన అదే కశ్మీర్ ఫైల్స్ సినిమాను తలపించింది.. పెహల్గం ఘటనను యావత్ దేశం వ్యతిరేకిస్తోంది.. దేశం శాంతి, సామరస్యంతో ఉండాలి.. ఉగ్ర శక్తులు భారతాన్ని ఏం చెయ్యలేవు.. భారత ప్రజలు ఐకమత్యంతో కలిసి ముందుకు నడవాలని మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.