హైదరాబాద్: విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) చర్చ జరిగింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇచ్చారు. గత ఏడెనిమిదేళ్లుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని..ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. 662 రెసిడెన్షియల్ స్కూళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అన్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థులు అరకొర వసతులతోనే చదువుకొంటున్నారని చెప్పారు. స్కూళ్లు మంజూరు చేయడం మంచిదే.. కానీ వసతులు కూడా కల్పించాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉండకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
స్కూల్‌లో ఉన్న పిల్లల గురించి ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. అన్ని స్కూళ్లలో అవసరమైన దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని అన్నారు. విశాల తరగతి గదులు, ల్యాబులు, తాగునీటి వసతి, క్లీన్ వాష్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ టీచర్లంతా మెరిటోరియస్.. వారు తాము పనిచేసే విద్యా సంస్థలను ఓన్ చేసుకోవాలని సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను రూ.11,600 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఎడ్యుకేషన్ కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగుచేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. 11 వేలకు పైగా టీచర్లను భర్తీ చేశామని ఉద్ఘాటించారు. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించామని గుర్తుచేశారు. కొత్త కోర్సులను పరిచయం చేశామని తెలిపారు. పిల్లల పాఠశాలల పెంచేందుకు, ఎంఎన్‌సీ కంపెనీలు, విదేశీ యూనివర్సిటీలతో తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. యూనివర్సిటీల్లో డిటెన్షన్, డ్రాపౌవుట్స్, మల్టీఫుల్ ఎంట్రీస్, మల్టీపుల్ ఎగ్జిట్స్, కామన్ సిలబస్, అంశాలపై చర్చించేందుకు ఇదివరకే కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చాక అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Betting Apps Investigation: రీతూ డుమ్మా.. హైకోర్టుకు విష్ణుప్రియ
Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Rajendra Prasad Apology: డేవిడ్ వార్నర్‌కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు
Read Latest Telangana News And Telugu News
Updated Date – Mar 25 , 2025 | 09:18 PM