Minister Anitha: త్వరలో 277 మందికి డీఎస్పీలుగా పదోన్నతి

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 21 , 2025 | 05:35 AM

రాష్ట్రంలోని 277 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు

 Minister Anitha: త్వరలో 277 మందికి డీఎస్పీలుగా పదోన్నతి

అసెంబ్లీలో తెలిపిన మంత్రి అనిత

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 277 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం అసెంబ్లీలో డీఎస్పీల పదోన్నతులపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. సీనియార్టీ జాబితాను సవరించడం వల్ల కొంతమంది కోర్టుకు వెళ్లారని, దీనివల్ల పదోన్నతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 1995 నుంచి పలువురు పదోన్నతులకు నోచుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చెప్పారు. కొత్త కానిస్టేబుళ్లను త్వరలోనే శిక్షణకు పంపిస్తామని మంత్రి తెలిపారు. కానిస్టేబుల్‌ నియామకాలకు మెయిన్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉందని, కోర్టు కేసు కూడా పరిష్కారం కావల్సి ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.

Updated Date – Mar 21 , 2025 | 05:36 AM

Google News

Subscribe for notification