హైదరాబాద్: అవసరాలకు అనుగుణంగా గోదావరి నదీ జలాలను తరలించి నగరవాసులకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) తెలిపారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలో రూ.13.96 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగకుండా మూసీనది ప్రక్షాళన చేస్తామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తన మాటలతో ముగ్గులోకి దింపి.. వలపు వల విసిరి..
కొంతమంది అనుమానాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, న్యాయం తమ వైపు నిలుస్తుందన్న నమ్మకాన్ని శ్రీధర్‌బాబు వ్యక్తం చేశారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుస్తామని స్పష్టం చేశారు. హయత్‌నగర్ సర్కిల్ పరిధి, కొత్తపేట డివిజన్‌లో కూడా మంత్రి పలు పనులకు శంకస్థాపన చేశారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
ఉదయం ఎండ .. సాయంత్రం వాన
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News