Mind Injury Meals: ఈ ఆహారాలు మెదడుకు స్లోపాయిజన్‌.. క్రమంగా మీ జ్ఞాపకశక్తి హుష్! జర భద్రం..

Written by RAJU

Published on:

Mind Injury Meals: ఈ ఆహారాలు మెదడుకు స్లోపాయిజన్‌.. క్రమంగా మీ జ్ఞాపకశక్తి హుష్! జర భద్రం..

మనం తీసుకునే ఆహారం శరీరంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నేటి వేగవంతమైన జీవితంలో అధికంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు జనాలు అలవాటు పడుతున్నారు. ఈ రకమైన ఆహారాలు తినడం వల్ల మెదడు శక్తి మందగిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి మానసికంగా చురుకుగా ఉండాలనుకుంటే, శరీరానికి ప్రమాదకరమైన ఈ విధమైన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి ఆహారం తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

మెదడు బాగా పనిచేయడానికి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే దొరికింది తినే అలవాటు మెదడులోని న్యూరాన్‌లను దెబ్బతీస్తాయి. దీంతో నిరాశ, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. ఇది పరిశోధనల ద్వారా కూడా వెల్లడైంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఇది మెదడును క్రమంగా దెబ్బతీసే స్లో పాయిజన్ లాంటిదన్నమాట.

శుద్ధి చేసిన చక్కెర

స్వీట్లు లేదా చక్కెర కలిపిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మెదడులో వాపు పెరుగుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు

బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలలో లభించే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు

వైట్ బ్రెడ్‌, బిస్కెట్లు, పిజ్జా, పాస్తా, మీట్‌, సాసేజ్‌లు, సలామీలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వాటి వినియోగాన్ని కూడా తగ్గించాలి.

సోడా, చక్కెర పానీయాలు

శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలలో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. ఇది మెదడులోని డోపమైన్ స్థాయిలను అసమతుల్యత చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, అలసట పెరుగుతాయి.

కాబట్టి మీ మెదడు, మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధమైన విషపూరిత ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆరోగ్యకరమైన మెదడుకు మనం తినే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం.

గమనిక: ఈ కంటెంట్‌ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights