Middle extends time period of Joint Parliamentary Committee

Written by RAJU

Published on:

  • జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువు పొడిగించిన కేంద్రం
  • 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ ఆమోదించింది
  • సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది
Middle extends time period of Joint Parliamentary Committee

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.

Also Read:Volkswagen: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు, రూ.2.5 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఎప్పటి వరకంటే..?

దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బీజేపీ ఎంపీ, మాజీ న్యాయశాఖ మంత్రి పిపి చౌదరి అధ్యక్షతన 39 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చుచ, సమయం ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించడం లేదు.

Subscribe for notification