Microplastics: మైక్రోప్లాస్టిక్స్‌తో మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు.. కొత్త అధ్యయనంలో వెల్లడి

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోప్లాస్టిక్స్‌తో మెదడుకు రక్తసరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుక మెదడులోని రక్తనాళాల్లో మైక్రోప్లాస్టిక్స్ వెళుతున్న తీరును పరిశీలించి ఈ అధ్యయనాన్ని వెలువరించారు. చైనీస రీసెర్చ్ అకాడమీ ఎన్విరాన్‌‌మెంటల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అత్యాధునిక లేజర్ ఇమేజింగ్ టెక్నిక్స్ ద్వారా ఈ అధ్యయనం నిర్వహించారు (Health).

Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి

మైక్రోప్లాస్టిక్స్‌తో కూడిన ఇమ్యూనిటీ కణాలు మెదడుకు రక్త సరఫరా చేసే నాళాల్లో ఇరుక్కుని పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో, రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడి చివరకు మెదడు పనితీరుపైనే ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. మైక్రోప్లాస్టిక్స్ నేరుగా మెదుడలోకి వెళ్లలేకపోయినా రక్త సరఫరాను మాత్రం అడ్డుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఇది చివరకు మెదడు సంబంధిత సమస్యలకు దారి తీస్తు్న్నట్టు గుర్తించారు. మైక్రోప్లాస్టిక్స్ కారణంగా రక్తసరఫరాలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఎలుక జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అవయవాల మధ్య సమన్వయం లోపించడం వంటి పరిణామాలను శాస్త్రవే్తలు గుర్తించారు.

Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తక్షణ రిలీఫ్!

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. చిన్న వాటికంటే పెద్ద మైక్రోప్లాస్టిక్స్ ఇలాంటి అడ్డంకులు సృష్టించే అవకాశం ఎక్కువని కూడా గుర్తించారు. ఈ బ్లాకేజీలు నెల రోజుల లోపే తొలగిపోయినా పదే పదే మైక్రోప్లాస్టిక్స్ బారిన పడితే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి మెదడు సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

అయితే, మనుషులపై మైక్రోప్లాస్టిక్స్ దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్‌తో చేసే ప్రయోగాలతో ఈ విషయంపై మరింత స్పష్టత రావొచ్చని కూడా అంటున్నారు. అయితే, మనుషుల్లో మెదడు సమస్యలు, మైక్రోప్లాస్టిక్స్ మధ్య సంబంధంపై మాత్రం మరింత స్పష్టత రావాల్సి ఉందని కూడా చెబుతున్నారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు సైన్స్ అడ్వాన్సె్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Read Latest and Health News

Subscribe for notification