MI vs SRH: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా.. హైదరాబాద్ ఓటమికి కాటేరమ్మ పెద్ద కొడుకే కారణం?

Written by RAJU

Published on:


Heinrich Klaasen Mistake: ఐపీఎల్ 2025లో భాగంగా 33వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నిజానికి, హెన్రిచ్ క్లాసెన్ చేసిన ఓ భారీ తప్పిదంతో ర్యాన్ రికెల్టన్ క్యాచ్ అవుట్ అయినప్పటికీ బిగ్ రిలీఫ్ పొందాడు.

ఈ సంఘటన జీషన్ అన్సారీ బౌలింగ్ సమయంలో జరిగింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లోని ఏడో ఓవర్‌లో చివరి బంతికి, ర్యాన్ రికెల్టన్ కవర్ వైపు భారీ షాట్ ఆడాడు. అక్కడ పాట్ కమ్మిన్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. తనకు తాను ఔటైనట్లుగా నిర్ణయించుకుని రికెల్టన్ పెవిలియన్ వైపు నడిచాడు. కానీ, థర్డ్ అంపైర్ ర్యాన్ రికెల్టన్‌ను ఆపాడు.

దీనికి కారణం ఏమిటంటే, థర్డ్ అంపైర్ రీప్లేలను తనిఖీ చేసినప్పుడు, రికెల్టన్ బంతిని కొట్టినప్పుడు, క్లాసెన్ గ్లోవ్స్ వికెట్ ముందు ఉన్నాయని తేలింది. అందువల్ల నిబంధనల ప్రకారం, ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించారు. ఈ విధంగా, క్లాసెన్ చేసిన పొరపాటు కారణంగా రికెల్టన్‌కు లైఫ్‌లైన్ లభించింది.

ఇవి కూడా చదవండి

నిబంధనల ప్రకారం, బౌలర్ వేసిన బంతి స్ట్రైకర్ బ్యాట్ లేదా శరీరాన్ని తాకే వరకు లేదా స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను దాటే వరకు లేదా స్ట్రైకర్ పరుగు తీసుకోవడానికి ప్రయత్నించే వరకు వికెట్ కీపర్ గ్లోవ్స్ వికెట్ల వెనుక ఉండాలి.

అయితే, రికెల్టన్ ఈ లైఫ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 23 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత మరుసటి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. హర్షల్ పటేల్ ఈ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

విజయానికి దగ్గరగా ముంబై ఇండియన్స్..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు 163 పరుగులు టార్గెట్ అందించింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు రికెల్టన్, రోహిత్ శర్మ జోడి 32 పరుగులు జోడించింది. హిట్‌మ్యాన్ చాలా మంచి లయలో ఉన్నట్లు కనిపించాడు. కానీ, 16 బంతుల్లో 26 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. ర్యాన్ రికెల్టన్ (31), సూర్యకుమార్ యాదవ్ (26), విల్ జాక్స్ (36) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. చివరికి హార్దిక్ పాండ్యా (21), తిలక్ వర్మ (17) జట్టును విజయపథంలో నడిపించారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights