Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI)కు 222 పరుగుల టార్గెట్ అందించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.
బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ (67 పరుగులు), కెప్టెన్ రజత్ పాటిదార్ (64 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించారు. జితేష్ శర్మ అజేయంగా 40 పరుగులు, దేవదత్ పడిక్కల్ 37 పరుగులు అందించారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తూరు ఒక వికెట్ పడగొట్టాడు.
17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించిన ఆర్‌సీబీ.. ఇప్పుడు ముంబైలోనూ 10 ఏళ్ల తర్వాత ఓడించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే క్రమంలో స్కోర్‌ను 200ల దాటించింది. మరి ముంబై ఎలా ఛేజింగ్ చేస్తుందో చూడాలి.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్లు: రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, స్వస్తిక్ చికారా, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..