MI vs KKR Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో తొలిసారిగా సొంత మైదానంలో ఆడబోతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దీంతో వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఇప్పటివరకు అంతగా కలసి రాలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు వరుసగా రెండు పరాజయాల తర్వాత, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో సొంత మైదానంలోకి రానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడితే, ఆ జట్టు సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కానీ, అజింక్య రహానె కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు మరుసటి మ్యాచ్‌లోనే పునరాగమనం చేసి రాజస్థాన్ రాయల్స్‌ను సులభంగా ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి
MI vs KKR మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలు..
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ గురించి మాట్లాడితే, ముంబై ఇండియన్స్ ఏకపక్షంగా ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు రెండు జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 23 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
రేపు MI vs KKR మ్యాచ్‌లో గెలుపు ఎవరిది?
ఈ ఐపీఎల్ సీజన్‌లో 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఏ జట్టు విజయం సాధిస్తుందో చెప్పడం కష్టమే. కానీ, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలిసారి సొంతగడ్డపై ఆడనుంది. ఇటువంటి పరిస్థితిలో వాంఖడే పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే.. ముంబైని ఓడిచడం కష్టమేనని తెలుస్తోంది.
MI vs KKR ఇరు జట్లు..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా.
స్క్వాడ్..
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), శ్రీజిత్ కృష్ణన్ (వికెట్ కీపర్), బెవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, రాజ్ అంగద్ బావా, విఘ్నేష్ పుత్తూర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రీస్ టోప్లీ, వీఎస్ పెన్మెట్సా, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ ఉర్ రెహమాన్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, మోయిన్ అలీ, రోవ్‌మన్ పావెల్, వెంకటేష్ అయ్యర్, లావ్‌నిత్ సిసోడియా, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, అన్రిక్ నోర్కియా, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..