meerut: భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ హత్య కేసులో తాజాగా మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు అధికారులు తెలిపారు. ముస్కాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ మర్డర్ కేసులో తాజాగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా సౌరభ్ రాజ్ పుత్ , ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో పాప పుట్టింది. అనంతరం ముస్కాన్ కు సాహిల్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్ కు వెళ్లి ఓ బేకరీలో పనిచేశాడు. ఇటీవల కూతురు బర్త్ డే కోసం అతను ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్ ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. అనంతరం వీరు డెడ్ బాడీని 15 ముక్కలుగా నరికి శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంట్ తో కప్పిపెట్టారు. ఇదంతా వీరిద్దరే పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. అంతేకాదు భర్త సంపాదించిన డబ్బును ప్రియుడు సాహిల్ శుక్లాకు ఇచ్చి బెట్టింగ్ ఆడించి వచ్చిన సొమ్ముతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
అయితే ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసిన నాటి నుంచి వీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని..వీరు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారినట్లు పోలీసులు తెలిపారు. జైల్లో ఆహారం మాని డ్రగ్స్ కావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్బం దాల్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.