Medication Value Hike: యాంటీబయాటిక్స్ నుండి డయాబెటిస్ మాత్రల వరకు.. 900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు! – Telugu Information | Important Medication Value Hike From Antibiotics To Diabetes These Tablets Will Be Extra Costly Now Test Charges

Written by RAJU

Published on:

Medicine Price Hike: ఇన్ఫెక్షన్, డయాబెటిస్, గుండె జబ్బులు లేదా నొప్పికి మందులు తీసుకుంటుంటే ఇప్పుడు వాటిని కొనడానికి గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి 900 కంటే ఎక్కువ ముఖ్యమైన మందులు ఖరీదైనవిగా మారాయి. ఈ మందుల ధరలు 1.74% పెరిగాయి. ఔషధాల ధరలను ప్రభుత్వ జాతీయ ఔషధ ధరల అథారిటీ (NPPA) నిర్ణయిస్తుంది. గత సంవత్సరం టోకు ధరల సూచిక (WPI) ప్రకారం.. ప్రతి సంవత్సరం ధరలు మారుతూ ఉంటాయి.

ఈ మందులన్నీ జాతీయ ముఖ్యమైన ఔషధాల జాబితాలో భాగం. ఇందులో అనస్థీషియా, అలెర్జీలు, నాడీ సంబంధిత రుగ్మతలు, గుండె జబ్బులు, చెవి-ముక్కు-గొంతు వంటి రోజువారీ మందులకు ఉపయోగించే పారాసెటమాల్, అజిత్రోమైసిన్, రక్తహీనత, విటమిన్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Vodafone Idea: వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థగా మారుతుందా?

ఇవి కూడా చదవండి

ఏ మందులు ఖరీదైనవి అవుతాయి?

➦ యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్: 250 mg టాబ్లెట్ ఇప్పుడు రూ.11.87కి, 500 mg రూ.23.98కి లభిస్తుంది.

➦ యాంటీ బాక్టీరియల్ సిరప్: అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ డ్రై సిరప్ ఒక మి.లీ.కు రూ. 2.09.

➦ యాంటీవైరల్ ఎసిక్లోవిర్: 200 mg టాబ్లెట్ ధర రూ.7.74, 400 mg టాబ్లెట్ ధర రూ.13.90.

➦ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్: 200 mg టాబ్లెట్ ధర రూ. 6.47, 400 mg టాబ్లెట్ ధర రూ. 14.04.

➦ నొప్పి నివారిణి డైక్లోఫెనాక్: ఒక టాబ్లెట్ ధర రూ. 2.09.

➦ ఇబుప్రోఫెన్: 200 mg టాబ్లెట్ రూ. 0.72కు, 400 mg టాబ్లెట్ రూ.1.22కు లభిస్తుంది.

➦ డయాబెటిస్ మెడిసిన్: డపాగ్లిఫ్లోజిన్, మెట్‌ఫార్మిన్, గ్లిమెపిరైడ్ కలయిక ఇప్పుడు ఒక టాబ్లెట్ ధర రూ. 12.74 అవుతుంది.

స్టెంట్ల ధరలు కూడా పెరుగుతాయి:

➦ మందులతో పాటు స్టెంట్లను తయారు చేసే కంపెనీలు కూడా ధరలను పెంచాయి. బేర్-మెటల్ స్టెంట్ కొత్త ధర రూ.10,692.69గా, డ్రగ్-ఎలుటింగ్ స్టెంట్ ధర రూ.38,933.14గా నిర్ణయించారు. స్టెంట్ అనేది ఒక చిన్న గొట్టం. దీనిని సాధారణంగా యాంజియోప్లాస్టీ లేదా మరేదైనా చికిత్సలో ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Underwater Train: నీటి అడుగున రైలు మార్గం.. ముంబై టూ దుబాయ్‌.. కేవలం రెండు గంటల్లోనే..!

ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ధరలు:

ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (DPCO) 2013లోని పేరా 16(2) ప్రకారం.. కంపెనీలు WPI ఆధారంగా తమ మందుల ధరలను పెంచుకోవచ్చని, ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదని NPPA తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అటువంటి పరిస్థితిలో ఏప్రిల్ 1 నుండి మందుల దుకాణాలలో పెరిగిన ధర అమల్లోకి వచ్చింది. త్వరలో NPPA అన్ని మందుల కొత్త ధరల జాబితాను విడుదల చేస్తుంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. ఆయన సంపదలో ఎక్కువ భాగం విరాళాలే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification
Verified by MonsterInsights