ABN
, Publish Date – Apr 10 , 2025 | 05:36 AM
పేదల పేరుతో 109 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి కుటుంబానికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్ వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు

రాయచోటి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పేదల పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబానికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం లేబాకలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 109.23ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ కుటుంబం ఆక్రమించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల్లో గయాలు భూములుగా ఉన్నవాటిని అక్రమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. సర్వే నం.121-5లో 3.50 ఎకరాలు ఉన్న రఘునాథరెడ్డి మరో చిన్నాన్న మేడా సుబ్బరామిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ ఆక్రమిత భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ 4న నోటీసులు జారీచేశారు. సకాలంలో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 10 , 2025 | 05:42 AM