Meat: రోజూ మాంసం తింటున్నారా.. ఈ వ్యాధి రావడం పక్కా..!

Written by RAJU

Published on:

Meat: చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా అని రోజు మాంసం తింటే ఈ వ్యాధి రావడం పక్కా అని వైద్యులు చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంతో పాటు మన మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతుంది. రోజూ మాంసం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు మాత్రమే కాకుండా మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. ఒక పరిశోధన ప్రకారం, రోజూ మాంసం, ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులు వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపుతో బాధపడుతున్నారు.

అధ్యయనం ప్రకారం :

ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్శిటీ పరిశోధకులు 438 మంది వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మన ఆహారపు అలవాట్లు మన జ్ఞాపకశక్తితో బలమైన సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనంలో ఎక్కువ మాంసం, ఫాస్ట్ ఫుడ్ తినే 108 మందికి అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 330 మంది వారి ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి రానట్లు తేలింది.

ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు మాంసం తినే అలవాటు ఉన్నవారికి ఏలాంటి సమస్యలు వస్తాయనేది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. యువతలో చాలా మంది మాంసాన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. దీని వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ వ్యాధులకు అల్జీమర్స్ పేరు కూడా చేరిపోయింది. వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధి అల్జీమర్స్ అని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ దల్జీత్ సింగ్ చెబుతున్నారు. ఈ వ్యాధి నరాల అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది.

నరాల సమస్య:

ప్రతి రోజు మాంసం, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకునే వారు నరాల సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. రోజు పండ్లు, కూరగాయలు, గింజలు తినే వ్యక్తులకు నరాల సమస్య లేదని వివరించారు. మాంసాహారం తినడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఎలా నివారించాలి?

మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు మొదలైనవి తినండి. బయట తినడానికి బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి.

  • రోజూ అరగంట పాటు వ్యాయామం లేదా నడవండి.

  • మీ బరువును అదుపులో ఉంచుకోండి.

  • రోజూ 7-8 గంటలు తగినంత నిద్ర తీసుకోండి.

  • రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి.

  • ఒత్తిడికి గురికావొద్దు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

యూరిక్ యాసిడ్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?

పచ్చి మిరపకాయలను ఇష్టంగా లాగించేస్తున్నారా.. బీ కేర్ ఫుల్..!

ఈ కలర్ ద్రాక్ష తింటే మీ గుండె సేఫ్.. అంతేకాకుండా…

For More Health and National News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights