ABN
, First Publish Date – 2023-06-28T10:42:53+05:30 IST
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్(MBBS, BDS) కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 28న బుధవారం నుం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్(MBBS, BDS) కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 28న బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యవిద్యా మండలి ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 10,875 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. స్వయం ప్రతిపత్తి వైద్య కళాశాలల సీట్లను కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని 38 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలోని ప్రభుత్వ కోటా సీట్లను, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సీట్ల భర్తీకిగాను అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తులను సమర్పించనున్నారు. జూలై 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసా గుతుందని వైద్య విద్యామండలి అధికారులు పేర్కొన్నారు.
Updated Date – 2023-06-28T10:42:53+05:30 IST