మారుతి సుజుకి వ్యాగన్ఆర్ చాలా కాలంగా భారతీయ కార్ల కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా కొత్త అప్‌డేట్స్, స్థిరమైన అమ్మకాల పనితీరుతో ఈ కారు ఇతర బడ్జెట్ కార్లకు గట్టి పోటీనిస్తుంది. తాజా అప్‌డేట్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను సెట్ చేసి ప్రయాణికుల భద్రతకు కీలక చర్యలు తీసుకున్నారు. హార్టెక్ట్ ప్లాట్ ఫామ్, హై టెన్సైల్ స్టీల్ నిర్మాణంతో వచ్చే వ్యాగన్ఆర్ ఇప్పుడు క్రాష్ జరిగినప్పుడు మెరుగైన రక్షణను అందించేలా రూపొందించారు. వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా అంటే 2022, 2023, 2024, 2025 సంవత్సరాల్లో వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. తాజా ఆర్థిక సంవత్సరంలోనే 1,98,451 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 3.37 మిలియన్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి
వ్యాగన్ఆర్ భారతీయ వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. వ్యాగన్ ఆర్ కారు ఇది 65 బీహెచ్‌పీ, 89 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 88 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం అందించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 56 బీహెచ్‌పీ, 82 ఎన్ఎం ఉత్పత్తి చేసే సీఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్లను 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ జత చేయవచ్చు. అయితే సీఎన్‌జీ వేరియంట్‌ను మాన్యువల్ గేర్బాక్స్ మాత్రమే అందిస్తారు. సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ కొనుగోలుదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది.
వ్యాగన్ఆర్ రోజువారీ సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచే లక్షణాలతో నిండి ఉంది. ఇది సౌకర్యవంతమైన నిల్వ కోసం 60:40 స్ప్రిట్ సీట్లు, స్టైలిష్ క్యాబిన్ అనుభూతి కోసం డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, డ్రైవింగ్ సౌలభ్యం కోసం టిల్ట్ స్టీరింగ్, డ్రైవర్‌కు సమాచారం అందించడానికి మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లేను అందిస్తుంది. ఇతర ఉపయోగకరమైన చేర్పుల్లో వెనుక పార్శిల్ ట్రే, హీటర్తో ఎయిర్ కండిషనింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు మద్దతు ఇచ్చే 17.78 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితం ప్రవేశ పెట్టిన వ్యాగన్ఆర్, టాటా ఇండికా, దేవూ మాటిజ్, హ్యుందాయ్ శాంట్రో వంటి చాలా కార్ల ఉత్పత్తిని నిలిపేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..