Mariyam Nawaz sentational feedback on Pahalgam Terror Assault

Written by RAJU

Published on:

  • పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు
  • భయపడాల్సిన అవసరం లేదు
Mariyam Nawaz sentational feedback on Pahalgam Terror Assault

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం ఒళ్లు బలుపు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరని అన్నారు.

Also Read:Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, అధికార పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “ఈరోజు భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కానీ అల్లాహ్ పాకిస్తాన్ సైన్యానికి దేశాన్ని రక్షించే శక్తిని ఇచ్చాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. “పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కాబట్టి ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరు.

Also Read:NBK : వీరసింహ రెడ్డి సినిమా వెనుక ఇంత డ్రామా నడిచిందా

మన రాజకీయ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ.. బాహ్య దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ దళాల వెనుక ఉక్కు గోడలా మనం ఐక్యంగా ఉండాలి” అని ఆమె అన్నారు.”పాకిస్తాన్ బలం దాని అమరవీరుల త్యాగాల నుంచి వచ్చింది” అని మరియం అన్నారు. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో తన తండ్రి కృషి ఉందని చెప్పింది. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో నవాజ్ షరీఫ్ చారిత్రాత్మక పాత్ర పోషించారని ఆమె అన్నారు.

Also Read:NBK : వీరసింహ రెడ్డి సినిమా వెనుక ఇంత డ్రామా నడిచిందా

అయితే, నవాజ్ షరీఫ్ కూడా ఇంకా పహల్గామ్ దాడిని ఖండించలేదు. ఈ అంశంపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. “రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య వనరులను ఉపయోగించాలని నవాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు. నవాజ్ దూకుడు వైఖరి తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు” అని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) వర్గాలను ఉటంకిస్తూ డైలీ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights