ABN
, Publish Date – Apr 02 , 2025 | 12:50 PM
ఒక పక్క దేశం మీద పడి రాజకీయ నేతల ముసుగులో దర్జాగా ప్రజల సొమ్ములు దోపిడీ చేస్తూ సర్వసుఖాలు అనుభవిస్తున్నారు కొందరు నేతలు. సమాజోద్ధరణ కోసమని నిద్రా నిప్పుల్లేకుండా అడవుల్లోనే గడుపుతోన్న మావోయిస్టులు..

Maoist
సమాజోద్ధరణ కోసం, తాము నమ్మిన సిద్ధాంతాలకోసం ఎండనకా వాననక నిద్రా నిప్పుల్లేకుండా తమ బంగారు జీవితాల్ని అడవుల్లోనే గడుపుతోన్న మావోయిస్టులు తాజాగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొంత కాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులు తాజాగా శాంతి చర్చలు ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కేంద్రానికి ఒక లేఖను విడుదల చేశారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని సదరు లేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 02 , 2025 | 12:56 PM