దేశ దిశ

Many will lose sleep: PM Modi’s jibe at INDIA Alliance

Many will lose sleep: PM Modi’s jibe at INDIA Alliance

  • ‘‘చాలా మందిని నిద్ర పట్టదు’’..
  • విజింజం ఓడరేవు ప్రారంభోత్సవంలో మోడీ సంచలన వ్యాఖ్యలు..
  • కాంగ్రెస్, ఇండీ కూటమిని ఉద్దేశించి కామెంట్స్..
Many will lose sleep: PM Modi’s jibe at INDIA Alliance

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేరళలో శుక్రవారం ఇండియా బ్లాక్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వేదికపై ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఉండగానే, ఇండీ కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరువనంతపురంలో విజింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టుని అదానీ గ్రూప్ చేపట్టింది. తరుచుగా, ఇండీ కూటమి నేతలు అదానీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంటారు. అయితే, అలాంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా హాజరయ్యారు.

Read Also: Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్ సూర్య

ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు శశిథరూర్ ఇక్కడ ఉన్నారు. నేటి కార్యక్రమం చాలా మందికి నిద్ర పట్టనివ్వదు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి చేరుకుంటుంది’’ అని మోడీ హాస్యాస్పదంగా అన్నారు. శశిథరూర్‌కి కాంగ్రెస్‌కి ఇటీవల దూరం పెరుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధానిని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో థరూర్ పర్సనల్‌గా రిసీవ్ చేసుకోవడంతో పాటు, విజింజం పోర్టును ప్రారంభించడం కోసం ఎదురుచూస్తున్నట్లు శశిథరూర్ ట్వీట్ చేశారు.

ఇటీవల, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మోడీ ప్రభుత్వం అవలంభించిన విదేశాంగ విధానాన్ని థరూర్ కొనియాడారు. భారతదేశ వ్యాక్సిన్ టీకా దౌత్యాన్ని కూడా థరూర్ ప్రశంసించారు. ఇదే కాకుండా, కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వాన్ని కూడా థరూర్ ప్రశంసించారు. తనను పట్టించుకోకుంటే, తనకు వేరే ఆప్షన్లు ఉన్నాయంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆయనకు మధ్య విభేదాలు ఏర్పడినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Exit mobile version