- నా భర్త రక్తపుమరకలు తుడవొద్దు
- మంజునాథ్ భార్య పల్లవి విజ్ఞప్తి

పహల్గామ్‌లో ఉగ్రమూకల చేతిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ ప్రాణాలు కోల్పోయాడు. భార్య, కుమారుడి ముందే ముష్కరులు ప్రాణాలు తీశారు. మంజునాథ్ భౌతికకాయం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్టులో ఆయా పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. మంజునాథ్ భార్య పల్లవిని కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె ఒక మనవి చేసుకుంది. తన భర్త రక్తపుమరకలు తుడవొద్దని.. అవి జ్ఞాపకంగా అలా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రక్తపుమరకలు తుడవద్దని కోరింది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ
పరామర్శ అనంతరం తేజస్వి సూర్య మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ మారణహోమంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భరత్ భూషణ్‌కు మూడేళ్ల కుమారుడు ఉన్నాడని.. ఆ బిడ్డకు మరణం అంటే ఏంటో కూడా తెలియదని చెప్పారు. అనాగరికమైన దాడుల్లో పహల్గామ్ దాడి ఒకటన్నారు. ఇక మంజునాథ్ కుమారుడు ఇంటర్ పూర్తి చేశాడని.. 96 శాతం మార్కులతో పాస్ అయ్యాడని చెప్పారు. మంజునాథ్, అతడి భార్య పల్లవి జాకెట్లపై రక్తపు మరకలు ఉన్నాయని.. వాటిని జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకుంటానని పల్లవి చెప్పిందని తెలిపారు. తన భర్తపై ఉన్న రక్తపుమరకలు కూడా తుడవద్దని కోరిందని తేజస్వి సూర్య పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..
మంగళవారం జరిగిన దుర్ఘటన గురించి ఓ జాతీయ మీడియాతో పల్లవి మాట్లాడారు. తన కళ్ల ముందే భర్తను చంపేశారని.. నా భర్తే లేనప్పుడు నేనెందుకు నన్ను కూడా చంపేయండి అని పల్లవి అడిగితే.. నిన్ను చంపను వెళ్లి ఈ విషయాన్ని మోడీకి చెప్పాలని ఉగ్రవాది అన్నట్టుగా పల్లవి తెలిపింది. దాడి జరగగానే స్థానికులు సహాయం చేసేందుకు వచ్చారని.. ముగ్గురు వ్యక్తులు తనను రక్షించారని చెప్పింది.
#WATCH | Karnataka | Bharat Bhushan from Bengaluru and Manjunath Rao from Shivamogga were killed in the #PahalgamTerroristAttack, their mortal remains have been brought to Bengaluru.
Union Minister Veeranna Somanna and BJP MP Tejasvi Surya pay floral tribute. The BJP MP was in… pic.twitter.com/SiphcDVOnD
— ANI (@ANI) April 24, 2025
#WATCH | Bengaluru | BJP MP Tejasvi Surya says, “Three people from Karnataka were brutally murdered in a terror attack in Pahalgam. In coordination with the Union Home Ministry, the local administration and the state government – we have ensured that the mortal remains as well as… https://t.co/k0r3CW0QWW pic.twitter.com/phSQH1Z71t
— ANI (@ANI) April 24, 2025