Mango Juice Unhealthy Effects: పండ్లలో రారాజు మామిడి అంటే చాలా మందికి ఇష్టం. వేసవిలో వచ్చే ఈ జ్యుసి తీపి పండు కోసం ప్రజలు ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మామిడి పండ్లు రుచిలో కొన్ని తియ్యగా, కొన్ని పుల్లగా ఉన్నా దీంతో జ్యూస్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ పండ్లను విడిగా ఎక్కువగా తింటే వేడి చేస్తుందనో.. కూల్ కూల్ గా మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలనే కోరిక వల్లో మామిడి పన్నా, మామిడి షేక్ మొదలైన ఐటెమ్స్ చేసుకుంటారు. వాస్తవానికి మ్యాంగో రుచిలోనే కాదు. పోషకాల్లోనూ రారాజే. ఇందులోని పోషకాలు ఎండకాలంలో శరీరాన్ని చల్లబర్చి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఎంతో రుచిగా ఉండే ఈ పండును జ్యూస్ చేసుకుని వీరు తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు దక్కడానికి బదులు హాని మాత్రమే కలుగుతుంది. పొరపాటున కూడా మ్యాంగో షేక్ తాగకూడని ఆ 7 మంది ఎవరో తెలుసుకుందాం.
డయాబెటిస్
మామిడికాయ షేక్‌లోని సహజ చక్కెర (ఫ్రక్టోజ్), కు తోడుగా తియ్యదనం కోసం వాడే చక్కెర కంటెంట్ కుడా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్న రోగులు మామిడి పళ్ల రసం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
అలెర్జీలు
కొంతమందికి మామిడి పండ్లు లేదా పాల ఉత్పత్తులు (పాలు, క్రీమ్) అలెర్జీ కావచ్చు. అటువంటి పరిస్థితిలో మామిడి జ్యూస్ తాగిన తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
ఊబకాయం
మ్యాంగో షేక్‌లో చక్కెర, క్రీమ్ లేదా ఐస్ క్రీం జోడించడం వల్ల కేలరీల సంఖ్య పెరుగుతుంది. ఇది ఊబకాయం పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు దీనిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు
మామిడి పళ్ల రసంలో ఉండే ఫైబర్, పాల కంటెంట్ కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన కడుపు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణక్రియ సరిగా లేని వారు గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలతో బాధపడవచ్చు.
కిడ్నీ రోగులు
మామిడిలో ఉండే అదనపు పొటాషియం అప్పటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడున్న వారి సమస్యలను మరింత పెంచుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రక్తంలో పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటే (హైపర్‌కలేమియా), కండరాల బలహీనత, హృదయ స్పందన రేటులో అసమానత ఏర్పడుతుంది. ఇతర తీవ్రమైన సమస్యలు రావచ్చు.
దంత సమస్యలు
మామిడి జ్యూస్‌లో చక్కెరతో పాటు ఆమ్ల స్వభావం ఎక్కువే. ఇది ఎక్కువగా తాగితే దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇది తాగాక నోటిలోని బ్యాక్టీరియా పంటి ఎనామిల్‌ను బలహీనపరిచే ఆమ్లాలను ఉత్పత్తి చేయడే కారణం. ఱఇక అప్పటికే కావిటీస్ లేదా సున్నితమైన దంతాలతో బాధపడుతున్న వ్యక్తులలో సర్వసాధారణం.
దగ్గు
మామిడి జ్యూస్ తయారు చేయడానికి చల్లటి నీరు, ఐస్ ఉపయోగిస్తారు. అందువల్ల దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి సమస్యను పెరగవచ్చు. అందుకే మ్యాంగో షేక్ తాగే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
Read Also: Belly Fat Reduction Tips: జపాన్ వాటర్ థెరపీతో.. బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోవడం పక్కా..
Remedies For Yellow Teeth: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే
Health Tips: ఉపవాసం విరమించిన వెంటనే కడుపు