- మధ్యప్రదేశ రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం..
- రైలులో పహల్గామ్ ఘటన వీడియో చూసిన వ్యక్తిపై దాడి..
- నిందితుల కోసం రైల్వే పోలీసులు గాలింపు..

Madhya Pradesh: మధ్యప్రదేశ రాష్ట్రంలోని భోపాల్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన రీల్ చూస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చిన తనపై దాడి చేశారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, యువకుడి ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 118 (1), 296, 351 కింద కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. ఇక, ఫిర్యాదుదారుడైన యువకుడికి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని GRP స్టేషన్ హౌస్ ఆఫీసర్ రష్మి పాటిదార్ తెలిపారు.
Read Also: Kaju Paneer Masala: చిటికెలో ధాబా స్టైల్ ‘కాజు పన్నీర్ మసాలా’ రెసిపీ తయారు చేయండిలా!
అలాగే, బాధిత యువకుడిని కొట్టడంతో పాటు రైలు నుంచి కిందకు తోసేస్తామని బెదిరించినట్లు చెప్పాడిపి GRP స్టేషన్ ఇన్‌ఛార్జ్ రష్మి పాటిదార్ చెప్పుకొచ్చారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొనింది. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనతో భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై భారత్ అనేక ఆంక్షలు విధిస్తుంది.