- కొమురం భీమ్ జిల్లాలో ఈ అరుదైన వివాహం
- ఇద్దరు యువతులను ప్రేమించిన యువకుడు
- వారిద్దరి సమ్మతితో వివాహం

Komaram Bheem Asifabad: కొమురం భీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో ఇద్దరు యువతులను ప్రేమించి, వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు యువకుడు. అటు గ్రామస్థులనే కాదు, ప్రజలనూ ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలకు ఆశీస్సులు అందజేశారు.
READ MORE: Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు.. ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు
గుమ్నూర్‌కు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు.. లాల్ దేవి, జలకర్ దేవి అనే యువతులను ప్రేమించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు తెలుసుకొని, ముగ్గురు ఒప్పందం చేసుకుని ఈ వివాహాన్ని అధికారికంగా అంగీకరించారు. వివాహానికి ముందు, మూడు కుటుంబాల సమ్మతితో బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్య తీసుకున్నారు.
READ MORE: Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు.. ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు
గ్రామస్థుల సమక్షంలో ఘనంగా జరిగిన వివాహ వేడుకలో రెండు కుటుంబాల పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా సూర్యదేవ్, లాల్ దేవి, జలకర్ దేవి వివాహ బంధంతో ఏకమయ్యారు. ఈ అరుదైన పెళ్లి గురించి తెలుసుకున్న ఇతర గ్రామాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.