- ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుకున్న కస్టమ్స్ అధికారులు. 63 కోట్ల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయి సీజ్.
- థాయిలాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలించడానికి ప్రయత్నం.

Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విదేశీ మూలాలు కలిగిన ఈ డ్రగ్స్ థాయిలాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలించడానికి ప్రయత్నించగా, అధికారులు అప్రమత్తతో దీన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 63 కోట్ల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిను సీజ్ చేశారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో అత్యంత చాకచక్యంగా దాచిన స్మగ్గలర్స్, దాన్ని సాధారణ ప్రయాణికుల లగేజ్ లాగా పంపించేందుకు యత్నించారు.
Read Also: Wife torture: భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. రైలు కింద పడి సూసైడ్..
బ్యాంకాక్ నుండి ఢిల్లీకి చేరుకున్న సమయంలో కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ ను తనిఖీ చేయగా, ఆ బ్యాగులలో బట్టలకు బదులుగా గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఈ సరుకును ఇద్దరు థాయ్ మహిళలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక వేరొక కేసులో మరో ఇద్దరు వ్యక్తులు రెండు ట్రాలీ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు దాచి తరలించే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ కేసులో ఇద్దరు వ్యక్తులు అరస్టయ్యారు. కస్టమ్స్ అధికారులు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. విదేశాల నుంచి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా దేశంలోకి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి నిత్యం ఒక కన్ను వేసి ఉన్నారు.