ABN
, Publish Date – Mar 23 , 2025 | 04:00 AM
తెలంగాణలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయిందని, కేసీఆర్.. పగటి కలలు మానుకుంటే మంచిదని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. సింగిల్‌గా కాదు.. ఆ పార్టీ బీజేపీతో జతకట్టినా అధికారం మళ్లీ కాంగ్రె్‌సదేనని స్పష్టం చేశారు.

-
కేసీఆర్.. పగటి కలలు మానుకో: టీపీసీసీ చీఫ్ మహేశ్
-
బీఆర్‌ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు: మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయిందని, కేసీఆర్.. పగటి కలలు మానుకుంటే మంచిదని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. సింగిల్‌గా కాదు.. ఆ పార్టీ బీజేపీతో జతకట్టినా అధికారం మళ్లీ కాంగ్రె్‌సదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌గానే అధికారంలోకి రానున్నామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌గౌడ్ స్పందించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ నినాదంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తోందన్నారు. గత పదేళ్లతో పోలిస్తే తెలంగాణ ఇప్పుడు ప్రగతి పథంలో సాగుతోందన్నారు.
ఫాంహౌస్ నుంచి బయటికొచ్చిన ప్రతిసారీ ప్రగల్భాలు పలకడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి కేసీఆర్ దాసోహం కావడం వల్లే కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు దక్కలేదన్నారు. ‘‘మీరు ఫామ్ హౌస్‌లో ఉంటూ.. ఎప్పటికీ అవే కలలు కనండి. మీ కార్యకర్తలనూ ఊహాలోకాల్లోనే ఉంచండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఇక మీరు ఎప్పటికీ అధికారంలోకి రారు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. కేసీఆర్ కలలు కంటూ ఫామ్‌హౌ్‌సలో ఉంటే.. తాము ప్రజల్లో ఉంటూ మంచి పాలన అందిస్తున్నామన్నారు.
Updated Date – Mar 23 , 2025 | 04:00 AM