Mahesh Babu: అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు సంపాదిస్తున్న బ్యూటీ..

Written by RAJU

Published on:


90’లలో ఆమె తోపు హీరోయిన్. తెలుగు, హిందీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. వెంకటేశ్, మహేష్ బాబు, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు వ్యాపారరంగంలో కోట్లు సంపాదిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్‏లో హీరో షారుఖ్ ఖాన్ ను సైతం బీట్ చేసింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రితీ జింటా. దిల్ సే సినిమాలో చిన్న పాత్రతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత ‘క్యా కెహ్నా’, ‘కోయి మిల్ గయా’, ‘వీర్-జారా’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో మరింత పాపులర్ అయ్యింది. తెలుగులో వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా.. మహేష్ బాబు జోడిగా రాజకుమారుడు చిత్రాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్.. 2008లో వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రీతి జింటా ఏకైక మహిళా జట్టు యజమాని. ఆమె ముగ్గురు భాగస్వాములతో కలిసి కింగ్స్ XI పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) జట్టులో పెట్టుబడి పెట్టింది. ఈ జట్టును కొనుగోలు చేయడానికి దాదాపు 76 మిలియన్ డాలర్లు అంటే రూ.662 కోట్లు ఖర్చు చేసింది. 2022 నాటికి ఈ జట్టు విలువ 925 మిలియన్ డాలర్లు. అంటే రూ.7775 కోట్లు.

ప్రీతి జింటా లాస్ ఏంజిల్స్‌కు చెందిన జీన్ గూడెనఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో సరోగసి ద్వారా కవలలు అమ్మాయి, అబ్బాయి జన్మించారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన ప్రీతి జింటా ప్రతి ఐపీఎల్ సీజన్ లో భారత్ కు వస్తుంది. ప్రీతి జింటాకు ముంబైలో రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, సిమ్లాలో ఒక అందమైన బంగ్లా ఉంది. దీని విలువ రూ.7 కోట్లు. ప్రీతికి అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో ఒక విలాసవంతమైన విల్లా ఉంది. అలాగే ఆమెకు నిర్మాణ సంస్థ ఉంది. దీని విలువ రూ.600 కోట్లు. అలాగే ఈ బ్యూటీ దగ్గర లెక్సస్ LX 470, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E-క్లాస్, BMW, పోర్స్చే వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights