Magnificence Ideas: మేకప్ విషయంలో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

Written by RAJU

Published on:

Magnificence Ideas: మేకప్ విషయంలో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ఈ రోజుల్లో మేకప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే కొంత మంది వేగంగా రెడీ కావడానికి కొన్ని తప్పుడు అలవాట్లు పాటిస్తారు. ఇవి చర్మ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. మరి అలాంటి పొరపాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజంతా ఆఫీసులో ఉన్నాక ఫంక్షన్‌కి వెళ్లాలంటే ఇంటికి వెళ్లే టైం ఉండకపోవచ్చు. చాలా మంది ఉదయం వేసుకున్న మేకప్ పై మరోసారి టచ్‌అప్ ఇస్తారు. కానీ ఇది తప్పు. చర్మం చక్కగా తేమగా ఉండాలి కానీ అలా మేకప్‌ను మళ్లీ వేసుకుంటే ముఖం పొడిబారిపోతుంది, మృతకణాలు పేరుకుంటాయి. పైగా ఈ విధానం మొటిమలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

ఇప్పటికే మేకప్ వేసుకున్నా, ఇంక సన్‌స్క్రీన్ అవసరమేంటి..? అనుకునే వారు కూడా ఉంటారు. కానీ ఇది పెద్ద పొరపాటు. మధ్యాహ్న వేళల్లో బయటికి వెళ్లాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరి. మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా, సన్‌స్క్రీన్‌ లేకపోతే చర్మం ఎండకు బలవుతుంది. కాబట్టి ముందుగా సన్‌స్క్రీన్ రాసుకుని దాని మీద మేకప్ వేసుకోవడం ఉత్తమం.

మేకప్ బ్రష్‌లను వాడిన తర్వాత శుభ్రం చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలా మళ్లీ వాడితే మొటిమలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం వారంలో ఒకసారి బ్రష్‌లను సున్నితంగా కడిగి శుభ్రపరచాలి.

తలస్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రయర్, స్ట్రెయిట్నర్, కర్లర్ వాడటం వల్ల జుట్టులో సహజ నూనె ఆవిరైపోతుంది. ఫలితంగా జుట్టు పొడిగా మారి విరిగిపోతుంది. వీటిని తరచూ వాడకూడదు. సహజంగా ఆరనివ్వడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తడిగా ఉన్న జుట్టును దువ్వడం కూడా మంచిది కాదు.

అలసిపోయి రాత్రి అలాగే నిద్రపోవడం చాలా మందికి అలవాటు. కానీ ముఖంపై మేకప్ అలాగే ఉండిపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా చర్మం మృతకణాలతో నిండిపోతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. అందుకే నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రంగా కడగడం తప్పనిసరి.

మేకప్ ప్రోడక్ట్‌లను కొన్నాక వాటి గడువు ముగిసినా పట్టించుకోకుండా వాడడం చాలా మంది చేస్తారు. కానీ ఎక్స్‌పైరీ అయిన ఉత్పత్తులను వాడితే చర్మ సమస్యలు రావచ్చు. కనీసం ఏడాదికొకసారి మేకప్ ప్రోడక్ట్‌లను రీచెక్ చేసి అవసరమైనవి మార్చుకోవడం మంచిది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా, ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ముఖ్యం.

Subscribe for notification