- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
- మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్.

ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో.. తొలి విజయం పైన కన్నేసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో లక్నో స్టార్ బౌలర్ అవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
Read Also: Walking: మార్నింగ్ వాకింగ్ ఇలా చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్:
ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్