అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహారపు అలవాట్లు: బరువు తగ్గడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనే కోరిక ఉన్నా.. ఏది పడితే అవి తింటే బరువు తగ్గరు. ఆహారపు అలవాట్లు బరువు తగ్గడానికి 80% దోహదం చేస్తాయి. బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం.
సమతుల్య ఆహారం తీసుకోండి: ప్రతిరోజూ 5 రకాల పోషకమైన ఆహారాలు తీసుకోండి. చక్కెరను తగ్గించడం చాలా అవసరం. స్వీట్లు, కాఫీ, టీలను తగ్గించండి. మీరు చక్కెర లేకుండా టీ, కాఫీ తాగవచ్చు. కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను నివారించండి.
చక్కెర పానీయాలు: మీరు బరువు తగ్గాలనుకుంటే చక్కెర పానీయాలు తీసుకోకండి. మీరు నీటిలో నిమ్మకాయ లేదా నారింజ రసం కలిపి తాగవచ్చు. మీరు చక్కెర లేకుండా తాజా పండ్ల రసాలను తీసుకోవచ్చు. రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం.
స్నాక్స్: మీ విశ్రాంతి సమయంలో మీరు తీసుకునే స్నాక్స్ మొత్తాన్ని తగ్గించండి. వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి, ముఖ్యంగా బరువు తగ్గడానికి మంచిది కాదు. వాటిని తగ్గించాలి.
వ్యాయామం: ప్రతిరోజూ చురుకుగా ఉండండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు నడవండి. లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఉపయోగించండి. బరువు తగ్గడానికి వ్యాయామం 20% దోహదపడవచ్చు,
ఒత్తిడి: మీరు ఒత్తిడికి గురైతే బరువు తగ్గడం కష్టం అవుతుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరచడం, సంతోషంగా ఉండటం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరిగిన ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తుంది.
8 గంటల నిద్ర: తగినంత నిద్ర పొందండి. మీ నిద్ర తక్కువగా ఉంటే, మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. సరైన నిద్ర బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. పగటిపూట వ్యాయామం చేయడం వల్ల రాత్రి బాగా నిద్రపోతుంది.
బరువు తగ్గడానికి చేయవలసినవి:
-
ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి
-
నూనె శాతం తగ్గించండి
-
రోజూ నడవండి
-
వారానికి 4 నుండి 5 రోజులు వ్యాయామం చేయండి
-
నీరు తాగండి
-
ఉదయం అల్పాహారం తీసుకోండి
-
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి
-
తీపి పదార్థాలను తగ్గించండి
-
బాగా నిద్రపోండి
పైవీటిని పాటిస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
-
Also Read: కుష్టు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో మీకు తెలుసా..