- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం
- ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు
- ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. నో ఎంట్రీ రోడ్లోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరిల్లాను ఢీకొన్నది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్ రాజవర్ధన్, వికేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
Also Read:Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా..!
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేసి భారీగా జరిమానాలు విధిస్తు్న్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో చాలామంది గాయపడి వైకల్యానికి గురవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు బాధితుల కుటుంబాల్లో తీరని షోకాన్ని నింపుతున్నాయి.