Lord Shiva Temple: ఏడాదిలో వైశాఖమాసంలోనే దర్శనం ఇచ్చే శివయ్య.. 11 నెలలు శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా…

Written by RAJU

Published on:

Lord Shiva Temple: ఏడాదిలో వైశాఖమాసంలోనే దర్శనం ఇచ్చే శివయ్య.. 11 నెలలు శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా…

పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శివాలయం పూజా సంప్రదాయాలు బిన్నంగా ఉంటాయి. ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్నిప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్ధానికులు విశ్వాసం. ఇంతకీ ఆ ఆలయం విశేషాలేంటో తెలుసుకుందాం..

పూర్వం మాతృహత్య పాతకం నుంచి తప్పించుకోవటం కోసం ఎక్కడ ఓంకార శబ్ధం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని పరశురాముడు బయలు దేరుతాడు. క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకుని గోస్తనీనది ప్రాంతం చేరుకుంటాడు పరుశురాముడు. అక్కడ నదీ గర్భంలో ఋషులు తపో దీక్షలో ఉంటారు. అక్కడ ఓంకార నాదం వినిపించడంతో ఆ ప్రాంతంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఏడు కోట్ల మంది బ్రహ్మాది దేవతలు పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్త కోటి రామేశ్వర లింగంగా పిలుస్తారు. అయితే పరశురాముడు ప్రతిష్టించటంతో అదే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్రహ్మది దేవతలు ఏడాదోలో 11 మాసాలు ఆలయాన్ని నీటిలో ఉంచి ఒక్క వైశాఖ మాసంలో మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వాలని సూచించారట. వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.

ఇంతకీ ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది. ఇక్కడ మరో శివలింగం కనిపిస్తుంది. దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామి వారిని దర్శించుకుని నత్తగుళ్లలు, ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్టించారని కథనం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి నత్తా రామేశ్వరంగా పేరు వచ్చింది. ఇక లక్ష్మణుడు ప్రతిష్టించిన మరో శివలింగం కూడా ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటారు.

నేటి నుంచి దర్శనం ప్రారంభం

ఈ ఏడాది వైశాఖ మాసం నేటి నుంచి (ఏప్రియల్ 28) ప్రారంభం కావటంతో ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి భక్తులకు స్వామి దర్శనం చేసుకునే వీలును అధికారులు కల్పిస్తున్నారు. మే 28న వైశాఖమాసం దర్శనాలు ముగుస్తాయని ఈవో యాళ్ల సూర్యనారాయణ తెలిపారు. మే5న వైశాఖ సోమవారం, మే 12న వైశాఖ మాస పౌర్ణమి, 19న వైశాఖ సోమవారం, 22న హనుమాన్ జయంతి తో పాటు 25న మాస శివరాత్రి, 26న వైశాఖ సోమవారం.. 27న వైశాఖ మాసం చివరి రోజును పర్వ దినంగా పరిగణిస్తారు. స్వామికి మహానివేదన సమర్పించి ఆలయాన్ని నీటితో తిరిగి నింపుతారు. ఈ నెలలోని పర్వ దినాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నసమారాధన జరుగుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights