Lokesh TDP Assembly: అలకలు వద్దు.. కష్టపడి పనిచేయండి

Written by RAJU

Published on:

అనకాపల్లి, మార్చి 31: అందరం కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర తిరిగి రాశామని..164 స్థానాలు కైవసం చేసుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) అన్నారు. సోమవారం యలమంచిలి నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్రతాంబూలమని, ఆ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, అధైర్యపడవద్దని హమీ ఇచ్చారు. అలకలుమాని పార్టీ కోసం పని చేయాలని కోరారు.

మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నామని తెలిపారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియమాకం చేపడతామన్నారు. పార్టీ కేడర్ అంతా ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జగన్ పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే తాను ఎక్కువగా పోరాడుతుంటానని వెల్లడించారు. ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తామన్నారు. ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామన్నారు. గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్‌బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలని తెలిపారు. పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలంతా అయిదేళ్లు నరకం అనుభవించారని.. ఎన్నో కేసులుపెట్టి హింసించారన్నారు.

lokesh.jpg

Kodali Nani Health: ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే లేనిచోట అక్కడ ఇన్‌చార్జి ప్రతివారం కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. చట్టపరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే అని తెలిపారు. తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ సర్పంచ్‌లతో పాటు 10 శాతం వైసీపీ వారు కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు తీసుకున్నారని అన్నారు. తప్పుడు కేసులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం

Read Latest AP News And Telugu News

Updated Date – Mar 31 , 2025 | 04:49 PM

Subscribe for notification
Verified by MonsterInsights