Liver Well being: మీకు ఈ అలవాట్లు ఉంటే.. లివర్‌కు ముప్పు పొంచి ఉన్నట్టే

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: అవయవాలన్నటిలోకి లివర్‌పై పని భారం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతుతారు. శరీరంలోని విషతుల్యాలను తొలగించడం, జీర్ణక్రియకు సహకరించడం, జీవక్రియలను నియంత్రించడం వంటి వాటిల్లో లివర్ పాత్ర ఉంటుంది. అయితే, లివర్ సంబంధిత సమస్యల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కన్నుమూస్తున్నారు. మొత్తం మరణాల్లో ఇవి దాదాపు 4 శాతం. లివర్ తనని తాను రిపేర్ చేసుకునే శక్తి ఉన్నప్పటికీ నిత్యం విషతుల్యాల బారిన పడటం, పని భారం కారణంగా లివర్ క్రమంగా బలహీన పడుతుంది. మనం సాధారణంగా తెలీక చేసే కొన్ని పొరాపాట్లు కూడా లివర్‌ను దెబ్బతీస్తాయి. అవేంటో.. పరిష్కారాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).

ఆహారంలో అధిక చక్కెరతో లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మనం అధికంగా తినే రిఫైన్డ్ షుగర్‌ను లివర్ కొవ్వుల కింద మార్చుతుంది. దీర్ఘకాలంలో ఇది నాన్ ఆల్కహాలిక ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది.

పెయిన్ కిల్లర్స్‌ను అతిగా వాడటం కూడా లివర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిత్యం పారాసిటమాల్ తీసుకుంటే లివర్‌కు ప్రమదం. చిన్న డోసుల్లో కూడా లివర్‌ను ఇది డ్యామేజ్ చేయగలదు. కాబట్టి, ఔషధాలను డాక్టర్ చెప్పిన డోసేజీ మేరకే వినియగించాలి. నొప్పి నివారణ కోసం సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ప్రయత్నించాలి

Wooden Cutting board: కూరలు తరిగేందుకు చెక్క బోర్డు వాడివారికో హెచ్చరిక!

డీహైడ్రేషన్ కారణంగా లివర్‌కు శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడం కష్టం అవుతుంది. దీంతో, ఇవి లివర్‌లో పేరుకుపోతాయి. కాబట్టి, రోజుకు తప్పనిసరిగా 8 గ్లాసుల నీరు తాగాలి. హెర్బల్ టీ, డీటాక్స్ పానీయాలతో కూడా లివర్ పనితీరు మెరుగవుతుంది.

కాలేయం ఆరోగ్యానికి మద్యపానం అలవాటు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడూ మద్యం తాగే వారిలో కూడా ఇన్‌ఫ్లమేషన్ ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఆల్కహాల్‌కు బదులు మాక్‌టెయిల్స్, ఇతర హెర్బల్ డ్రింక్స్ వైపు మళ్లాలి.

ఫాస్ట్ ఫుడ్స్, నూనెలో బాగా వేయించిన ఫుడ్స్‌తో కూడ లివర్‌కు ముప్పు కలుగుతుంది. వీటిల్లోని ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్‌ కారణంగా లివర్‌పై పనిభారం పెరుగుతుంది. అంతేకాకుండా, అనారోగ్యకర కొవ్వు శరీరంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్ బారినపడతారు కాబట్టి ఇంట్లో చేసే ఆహారాన్నే తినాలి. ఫాస్ట్ ఫుడ్‌ను పక్కనపెట్టి పోషకాలు అధికంగా ఉన్న ఆహారమే తినాలి

Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!

నిత్యం ఉపవాసాలు ఉండటం లేదా బిజీగా ఉన్నామనో మరేదో కారణంతోనే ఓ పూట భోజనం మానేయడం కూడా రిస్కే. నిత్యం ఇలా చేస్తే లివర్‌కు పోషకాలు అందక క్రమంగా బలహీనపడుతుంది. కాబట్టి, తక్కువ మొత్తాల్లో ఆహారం రోజుకు పలుమార్లు తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

మనం నిద్రించే సమయంలోనే లివర్ తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. నిత్యం నిద్రలేమితో సతమతమయ్యే వారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ పెరిగి పలు సమస్యల బారిన పడతారు. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి

కెఫీన్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగడం కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను శుభ్రంగా కడగకపోతే వాటిపై ఉన్న క్రిమిసంహారకాలు, ఎరువుల కారణంగా దీర్ఘకాలంలో లివర్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Read Latest and Health News

Subscribe for notification