- మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
- నాలుగు రోజులపాటు వైన్స్ బంద్
- బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు

బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్న సెలబ్రేట్ చేసుకోవాలంటే మద్యం ఉండాల్సిందే అన్నట్లు మారిపోయాయి పరిస్థితులు. మరికొందరికైతే చుక్కపడనిదే పూటగడవని పరిస్థితి. షాప్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి మద్యం ప్రియులకు బిగ్ షాక్. ఏకంగా 4 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే? ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Also Read:Bihar’s IIT Village: కేంద్రం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ గ్రామం.. జేఈఈ మెయిన్‌లో 40 మంది ఉత్తీర్ణత
ఈ నేపథ్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నెల 25న కౌంటింగ్ జరుగనున్నది. ఆ రోజు కూడా వైన్స్ బంద్ కానున్నాయి. అంటే మొత్తం 4 రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు పూర్తైన అనంతరం యథావిధిగా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.