
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. పొదుపు, తక్షణ యాన్యుటీ ప్లాన్‌ల కోసం నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్‌గా పిలువబడే ఇది అనేక రకాల యాన్యుటీ ఎంపికలు ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ మల్టీ యాన్యుటీ ఎంపికలతో పాటు ఏకమొత్తం మరణ ప్రయోజనాలతో పాటు వాయిదాల రూపంలో కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అదనపు ప్రయోజనాలతో ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ గురించి మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అంటే?
వ్యక్తులు, గ్రూప్స్ రెండింటికీ యాన్యుటీ పరిష్కారాలను అందించే నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ సేవింగ్స్ ప్లాన్.
అర్హత
18 నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా యాన్యుటీ ఎంపిక ఆధారంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.
యాన్యుటీ ఎంపికలు
సబ్‌స్క్రైబర్లు సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీతో సహా రెండు యాన్యుటీ ఎంపికలలో ఒకదానిని ఎంచుకోవచ్చు.
కనీస మొత్తం
- నెలకు రూ. 1,000
- త్రైమాసికానికి రూ. 3,000
- అర్ధ సంవత్సరానికి రూ. 6,000
- సంవత్సరానికి రూ. 12,000
రుణ సదుపాయం
పాలసీ జారీ చేసిన మూడు నెలల తర్వాత లేదా ఫ్రీ-లాక్ వ్యవధి పూర్తయిన తర్వాత రుణాలు పొందవచ్చు. పాలసీ కింద మంజూరు చేసే గరిష్ట రుణ మొత్తం, రుణంపై చెల్లించాల్సిన ప్రభావవంతమైన వార్షిక వడ్డీ మొత్తం పాలసీ కింద చెల్లించాల్సిన వార్షిక యాన్యుటీ మొత్తంలో 50 శాతానికి మించకూడదు.
ఎన్‌పీఎస్ చందాదారులకు నిబంధనలు
జాతీయ పెన్షన్ వ్యవస్థకు సభ్యత్వం పొందినవారు తక్షణ యాన్యుటీని పొందవచ్చు. ఇది పదవీ విరమణ ఆదాయానికి సజావుగా మారడానికి వీలు కల్పిస్తుంది.
వైకల్యం ఉన్న వారికి ప్రయోజనాలు
ఈ పథకాన్ని దివ్యాంగుల ప్రయోజనం కోసం నామినీ/యాన్యుటెంట్‌గా కొనుగోలు చేయవచ్చు. యాన్యుటెంట్ (ప్రతిపాదకుడు) మరణిస్తే, నామినీగా ఉన్న దివ్యాంగుల జీవితంలో తక్షణ యాన్యుటీని కొనుగోలు చేయడానికి మరణ ప్రయోజనాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి.
దరఖాస్తు ఇలా
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆఫ్‌లైన్ కొనుగోళ్లను ఎల్ఐసీ ఏజెంట్లు, మధ్యవర్తులు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయాలు, కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ ద్వారా చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి