
ల్యాప్‌టాప్ లేకుండా ఒక గంట కూడా గడవని రోజులవి. ఐటీ ఉద్యోగుల నుంచి బిజినెస్‌మెన్, స్టూడెంట్స్ ఇలా ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారింది ల్యాప్‌టాప్. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అయితే తిండి లేకుండా ఉండగలరేమో గానీ ల్యాప్‌టాప్ లేకుండా ఉండలేరు. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం వల్ల ఇంట్లో 24 గంటలు ల్యాప్‌టాప్‌లతోనే కాపురం చేస్తున్నారు. అన్ని పనులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే ల్యాప్‌టాప్ వాడే విషయంలో చార్జింగ్ పెట్టుకోవడం ఒకటే పెద్ద సమస్య. ఇక ట్రావెలింగ్‌లో ఉన్నవాళ్లకి, ఔట్ స్టేషన్ వెళ్లేవాళ్లకి పదేపదే ల్యాప్‌టాప్ ఛాచార్జింగ్ సమస్య వేధిస్తుంది.
ఇక దీనికి పుల్ స్టాప్ పెట్టింది లెనోవో కంపెనీ. అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేని అద్భుత ఆవిష్కరణ తీసుకువచ్చింది. ఇప్పటివరకు సోలార్ పవర్‌తో నడిచే చాలా వస్తువులను చూశాం. ఇకపై ఈ లెనోవో ల్యాప్‌టాప్ కూడా సోలార్ పవర్‌తో రన్ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ల్యాప్‌టాప్ స్క్రీన్ పైన ఉండే ప్యానల్ మొత్తాన్ని సోలార్ ప్యానల్‌గా మార్చేసింది. అయితే అందరికీ వచ్చే అనుమానం ఈ ల్యాప్‌టాప్‌ను పట్టుకుని ఎండలో కూర్చోవాలా అని.?
అలాంటి అవసరమే లేదు. మీ ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉండే లైటింగ్‌తోనే ఈ ల్యాప్‌టాప్ ఛార్జ్ అయిపోతుంది. తొమ్మిది గంటలు పూర్తిగా ఇన్సైడ్ లైటింగ్‌లో ఉంటే చాలు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక తేలికపాటి ఎండలో అయితే రెండు గంటలు ఉంటే చాలు ఫుల్ ఛార్జ్ పూర్తి అవుతుంది. పూర్తి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇది ఎప్పుడూ ఆగిపోదు. మనం పని చేస్తున్నంతసేపు ఎదురుగా లైట్ ఉంటే చాలు అక్కడి నుంచి ఛార్జ్ అవుతూ నడుస్తూనే ఉంటుంది.
ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేసే వాళ్లకి.. క్లయింట్స్ దగ్గరికి వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్స్‌కి, తరచుగా కూర్చున్న చోట కాకుండా అటూ.. ఇటూ తిరుగుతూ పనిచేసే వాళ్లకి ఇది మోస్ట్ యూజ్‌ఫుల్. ప్రస్తుతానికి అయితే అమెరికా, చైనా, యూరప్ మార్కెట్‌లలో లెనోవో దీన్ని ప్రవేశపెట్టింది. మరికొద్ది రోజుల్లో ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే దీని ధర రూ. 1,75,000.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..