Kuwait: కువైట్ లో దారుణం.. తెలుగు మహిళపై యాసిడ్ దాడి

Written by RAJU

Published on:

Kuwait: కువైట్ లో దారుణం.. తెలుగు మహిళపై యాసిడ్ దాడి

Kuwait: కువైట్ లో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళపై అక్కడి యజమానులు యాసిడ్ దాడి చేశారు. తర్వాత పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మీ భర్త మరణించడంతో ఉపాధి కోసం రెండు నెలల క్రితం వైస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎంజెట్ ద్వారా కువైట్ వెళ్లారు. అక్కడ ఇంట్లో పనిచేయాలని 150 దీనార్లు వేతనంగా ఇస్తామని ఒప్పందం కుదిరింది.

ఉద్యోగంలో చేరాక యజమానులు 100 దీనార్లే ఇవ్వడంతో లక్ష్మీ వారిని ప్రశ్నించింది. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెపై యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన జరిగి 10 రోజులు అవుతుండగా..బాధితురాలు కొంచెం కోలుకున్న తర్వాత ఆసుపత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. బాధితురాలి పాస్ పోర్టు ఇంటి యజమానుల దగ్గర ఉండటంతో కేసు వెనక్కు తీసుకుంటే ఇస్తామని వారు వేధిస్తున్నారు.

ఏం చేయాలో తెలియకపోవడంతో ఆమె పిచ్చాసుపత్రిలోనే మగ్గిపోతోంది. ఏజెంట్ ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించింది లక్ష్మీని స్వగ్రామానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights