కర్నూలు మునిసిపల్ పాఠశాల ఘనత
43 మందిలో 42 మందికి 500కుపైగా మార్కులు
కర్నూలు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాల వరుసగా నాలుగో ఏడాది కూడా వందశాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ఈ పాఠశాల నుంచి ఈ ఏడాది 43 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవగా, వారిలో 42 మంది 500మార్కులకుపైగా సాధించడం గమనార్హం. మిగిలిన ఒక్క విద్యార్థికి మాత్రం 491 మార్కులు వచ్చాయి. గణితంలో 14 మంది, సైన్స్‌లో 9 మంది, సోషల్‌లో ఇద్దరు, హిందీలో ఒక్కరు నూటి కి నూరు మార్కులు సాధించారు. టీపీ సాయి లిఖిత అత్యధికంగా 595 మార్కులు, శృతి 591, చక్రధర్ 588, హరిణి 586, పార్థసారధి, మేఘన 584, లోషిత 583, కౌషిక్ కుమార్ 582, విష్ణుప్రియ 581, సంజయ్ కుమార్ 580 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అభినందించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ…
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date – Apr 24 , 2025 | 05:11 AM