కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డులో ఒక్కసారి 6 అడుగుల ఉన్న నాగుపాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న రోగులందరూ భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న రోగుల బంధువులు ఆ పామును వెంటాడి, ముందుగా పిల్లల వార్డులో నుంచి బయటకు వచ్చేలా చేసి దానిని చంపడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి ఆవరణ చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంతో ఇలా విషపురుగులు నిత్యం వస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం సమయంలో కాబట్టి పాము కనపడిందని.. రాత్రి సమయంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆస్పత్రి ఆవరణ చుట్టూ శుభ్రంగా ఉండేలా చూడాలని రోగులు కోరారు.

Kurnool: ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా – Telugu Information | King Cobra Hulchul In Kurnool Authorities Hospital, particulars right here

Written by RAJU
Published on: