హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించి చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) టార్గెట్‌గా పలు కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పారన్నారు. 71 వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నారన్నారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవన్నారు. ‘కుటుంబాలు మాకు లేవా.. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా? నాకు అడ్డమైనవారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు, వాణిలు బయట పెట్టాలా? పిచ్చి పనులకు చేస్తున్నారు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు? నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు’ అంటూ ఫైర్ అయ్యారు.
గాసిప్స్ బంద్ చెయ్..
మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నారన్నారు. సంపద సష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చారని నిలదీశారు. కేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్‌పై దృష్టి పెట్టాలని హితవుపలికారు. పదిహేనేళ్ళగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటంటూ ఎద్దేవా చేశారు.
ఎవరేంటో అన్నీ తెలుసు…
రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నారన్నారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని అడిగారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలన్నారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసన్నారు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. పదేళ్ళు అధికారంలోకి ఉన్న తమకు ఎవరు ఎంటో అన్నీ తెలుసన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.
నేను వదిలిపెట్టా..
ఫార్ములా ఈరేసింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా తాను వదిలిపెట్టేది లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ జరుపుతామన్నారు. ఒలంపిక్స్ నిర్వహణపై ఎంత ఖర్చు అవుతందో రేవంత్‌కు తెలుసా అని అన్నారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చిన సన్నాసికి ఒలంపిక్స్ కావాలా అంటూ మండిపడ్డారు. ఎంఐఎం విషయంలో తాము కూడా తప్పు చేశామన్నారు. ఎంఐఎంకు ఉన్న సంఖ్యా బలమెంత? అక్బరుద్దీన్‌కు ఇస్తోన్న సమయం ఎంత అని ప్రశ్నించారు. అక్బర్ స్పీచ్‌ను పది నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి… ఈసారి తామేంటో ఎంఐఎంకు చూపిస్తామని హెచ్చరించారు. పదేళ్ళు అధికారంలో ఉండగా.. అక్బరుద్దీన్ తీరును గమనించినట్లు తెలిపారు. అలగటం.. ఏదొక పని చేపించుకోవటం ఆయన నైజమన్నారు. వాళ్ళ పని అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెప్తున్నారన్నారు. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని.. మంత్రులే చెప్తున్నారన్నారు. అందాల పోటీలు పెట్టి.. ఏం సాధించాలనుకుంటున్నారో రేవంత్ చెప్పాలన్నారు. రైతులకు ఇవ్వటానికి లేని డబ్బులు.. అందాల పోటీలకు ఎక్కడవి అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తే ఎలా తప్పు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి…
Land Grabbing: రామచంద్రా.. ఏమిటీ అరాచకం?
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News
Updated Date – Mar 17 , 2025 | 12:13 PM