ABN
, Publish Date – Mar 19 , 2025 | 06:59 AM
విషం తప్ప విషయంలేని సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘సాగునీరు అందకపోతే తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లుతుందని ముంచుకొస్తున్న ముప్పు ను ముందే హెచ్చరించాం.. అయినా విషం తప్ప విషయంలేని సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. పచ్చని పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఇది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని హెచ్చరించారు. సర్కారు బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ రైతాంగంతో కలిసి కాంగ్రెస్ సర్కార్ భరతం పడతామన్నారు.
Updated Date – Mar 19 , 2025 | 07:00 AM